about us

About Vasavisatra Samudayam

వాసవీసత్ర సముదాయము పరిపాలకులు: శ్రీశైల క్షేత్ర నగర ఆల్ఇండియా ఆర్యవైశ్య అన్న సత్ర సంఘము , శ్రీశైలం అను పేరుతో 1956 సంవత్సరంలో రోడ్డు మార్గము లేక ముందు గార్దభాములపై సామాను తీసుకొని వెళ్లి శివరాత్రికి అన్నసత్ర ఏర్పాటు చేసినాము. తర్వాత 24-11-57 న ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డి గారి చేత శంకుస్థాపన చేయబడి వసతి సత్ర నిర్మాణము చేస్తూ 25-12-62 తేదిన శ్రీ బచ్చు గురుమూర్తి, ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖామంత్రి గారిచే నిత్య అన్నసత్రము ప్రారంభించి వాసవి సత్రం, శ్రీ శైలం పేరుతో నడుపుచున్నాము.

వాసవీనివాస్: వాసవీనివాస్ పేరుతో పుట్టపర్తిలో 1.90 సెంట్లు భూమిని 20-08-1980 తారీఖున శ్రీశ్రీశ్రీ భగవాన్సత్యసాయిబాబా వారిచే శంఖుస్థాపన గావించబడి వసతిసత్ర నిర్మాణము జరుపుతూ 16-11-1995 తేదిన శ్రీ ఆత్మకూరు నాగభూషణం శెట్టి గారి చేత నిత్య సత్రం ప్రారంభించి నడుపుచున్నాము.

వాసవీనిలయం, తిరుపతి: మద్రాసు వాస్తవ్యులు శ్రీ ఉప్పులూరియతిరాజులుచేట్టి ట్రస్టు వారి తమ్ములు ద్వారా తిరుపతిలోని కోతవీధిలో 60’x100’ గల పురాతన భవనము ఉచితంగా స్వీకరించి 04-10-1995 తేదిన శ్రీ వి. ఎంబెరుమన్నారుచేట్టి గారి ద్వార శంకుస్థాపన చేయబడి అదే రోజు శ్రీ ఆత్మకూరు నాగభూషణంశెట్టి గారి ద్వారా నిత్య అన్నసత్రము ప్రారంభించబడి వాసవీనిలయం, ఉప్పుటూరియతిరాజులుచేట్టిట్రస్టు పేరుతో నడుపుచున్నాము.

వాసవీభవన్, తిరుమల: ఈ సత్రమునకు 1) పొత్తూరు అయ్యన్నశెట్టిసత్రము తరుపున శ్రీఎంబెరుమన్నారుచేట్టి గారు, 2) తిరుమల శ్రీవారి అనివర ఆస్తానం చారిటీస్తరపున శ్రీకొత్తమాచు విశ్వనాధంశేట్టిగార్ల నుంచి 100×50 = 5000 చదరపు అడుగుల స్థలం స్వీకరించి 4 అంతస్తుల భవనము నిర్మించినాము మరియు నిత్యాన్నదానం ది. 30-03-2001 న శ్రీ కొణిజేటి రోశయ్య గారు, మాజీ మంత్రివర్యులు గారిచే ప్రారంభించి నిత్య అన్నసత్రము నడుపుచున్నాము.

వాసవీబీద విద్యార్ధినిధి: శ్రీశైలం పేరుతో భక్తాదుల వద్ద నిధులు వసూలు చేసి ఎంసెట్ ద్వారా ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలలో సీట్లు సంపాదించి ఫీజు కట్టిన రశీదు, ర్యాంకు కార్డు, మార్క్స్ లిస్టుల ఫొటోస్టాట్ కాపీలు మరియు యీ పుస్తకములో వేయబడిన మా కమిటిలో ఏ ఒకరి చేతనైనా బీద విద్యార్ధి అని సర్టిఫికేట్స్ పంపిన వారికీ స్కాలర్షిప్ లు ఇచ్చుచున్నాము. పూర్తి బయోడేటా, ఫోటోతో మరియు కాలేజి అడ్రెస్సులతో సహా పంపవలయును.

వాసవీవార్షిక మహాక్రతువు: శ్రీశైలం పేరుతో 1. తిరుచానూరు, 2. పెనుగొండ, 3. పుట్టపర్తి, 4. విజయవాడ, 5. రాజమండ్రి,లలో శ్రీ వాసవీ క్రతువులు 9 రోజులు 108 కుండములతో పెట్టి రోజుకు 10 వేలమందికి భోజనములు జాతి, కుల, మత భేదములు లేకుండా పెట్టుచున్నాము.

వాసవీసదన్, వారణాశి: భారతదేశంలోప్రముఖ పుణ్యక్షేత్రాలలోఒకటైన వారణాశి ( కాశీ ) లో త్వరలో 100 రూములతో సత్ర నిర్మాణము చేయుటకు ది. 27-04-2011 న శంఖుస్థాపన కావింపబడి, నిత్య అన్నదానము చేయుటకు దాతలనుండి విరాళములు సేకరించుచున్నాము.

Important Note : ప్రస్తుతము మా వాసవి సత్రం లో రూము లు www.yatradham.org వెబ్సైట్ లో తప్ప మిగతా ఎటువంటి online బుకింగ్ లు మేము నిర్వహించటం లేదు. మా సంస్థ పేరు తో కొన్ని online మోసాలు జరుగుతున్నందున వాటికి, మా సంస్థ కు ఎటువంటి సంబంధం లేదని, యాత్రికులు తగు జాగ్రత్త తో వ్యభరించవలసినది గా హెచ్చరించుచున్నాము”